calender_icon.png 24 February, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీజీసెట్ పరీక్షా కేంద్రాలను తనిఖీ

24-02-2025 12:19:54 AM

 జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు.

గద్వాల, ఫిబ్రవరి 23 ( విజయక్రాంతి ) : జోగులాంబ గద్వాల జిల్లాలో టీజీసెట్-2025 గురుకుల ప్రవేశ పరీక్షల సందర్భంగా ఎర్రవల్లి లోని తెలంగాణ రాష్ర్ట గురుకుల పాఠశాల & జూనియర్ కళాశాల (బాలురు) మరియు ఇటిక్యాల లోని తెలంగాణ రాష్ర్ట గురుకుల పాఠశాల & జూనియర్ కళాశాల (సీఓఈ బాలురు) పరీక్షా కేంద్రాలను ఆదివారం జిల్లా అదనపు కలెక్టర్  తనిఖీ చేశారు.పరీక్షా నిర్వహణ తీరును సమీక్షిస్తూ,కేంద్రాల్లో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల్లో నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, మార్గదర్శకాలను అనుసరించి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రామాంజనేయులు, ఉపాధ్యాయులు,తదితరులు పాల్గొన్నారు.