17-12-2024 01:24:25 AM
* త్వరగా పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశం
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 16 (విజయక్రాంతి): శిల్పా లేఅవుట్ సెకండ్ లెవల్ ఫ్లుఓవర్ పనులను త్వరతగతిన పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. గచ్చిబౌలి నుంచి కొండాపూర్‌కు వెళ్లే శిల్పా లేఅవుట్ సెకండ్ లెవల్ ఫ్లుఓవర్ పనులను కమిషనర్ సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇక్కడి సర్వీస్ రోడ్డుకు భూసేకరణ పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాల భవనం కొంతమేర కోల్పోతున్నందున విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీఎస్సార్ పద్ధతిలో భవన నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్‌ను ఆదేశించారు. రోడ్డును దాటే ప్రమాదాలకు అవకాశం లేకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. సీఈ దేవానంద్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, ఎస్‌ఈ శంకర్ నాయక్ పాల్గొన్నారు.