calender_icon.png 30 October, 2024 | 6:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శానిటరీ నాప్కిన్ యూనిట్ల పరిశీలన

30-10-2024 01:34:14 AM

ఇల్లెందు, అక్టోబర్ 29 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గంలోని టేకులపల్లి, ఇల్లెందు మండ లాల్లో భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బీ రాహుల్ మంగళవారం పర్యటించారు. ఎంఎస్‌ఎం పథకం కింద ఐటీడీఏ ద్వారా మంజూరైన పథకాల పర్యవేక్షణలో భాగంగా టేకుల పల్లిలో ఏర్పాటు చేసిన సఖి శానిటరీ నాప్కిన్ యూనిట్‌ను పరిశీలించారు.

మిషనరీ కొనుగోలు ఎక్కడ చేశారు? రోజుకు ఎన్ని ఉత్పత్తి చేస్తున్నారు? మార్కెటింగ్ సౌకర్యం ఎలా ఉంది? అనే విషయాలను సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బోడులో ఏర్పాటు చేసిన పేపర్ బ్యాగుల తయా రీ కేంద్రాన్ని సందర్శించారు.

పది రోజుల్లో యూనిట్ ప్రారంభం అయ్యే విధంగా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఏపీఎం రవికుమార్, జేడీఎం హరి, సీసీ శ్రీలత, సునీల్ గ్రూప్ సభ్యులు గౌసియా, పుల్లమ్మ, కరుణ పాల్గొన్నారు.