మునగాల జనవరి 30: మండలంలోని తా డ్వాయి గ్రామంకి జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, కోదాడ సహాయ వ్యవసాయ సంచాలకులు ఎల్లయ్య తో పాటు గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్ర వేత్తలు నరేష్, కిరణ్ ఆదర్శ్ వరి పోలాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.చైతన్య, జీనేక్స్, అంకూర్, గడ్డిపల్లి నుంచి తీసుకొచ్చిన విత్తనాలు, ఇంకా కొన్ని ఇతర ప్రైవేటు కంపెనీలకు సంబంధించిన సన్న రకం వరి విత్తనాలు డిసెంబర్ 10 తారీకు లోపల నాట్లు వేయడం వలన చల్లుకోవడం వల్ల తల్లి కర్ర, పిల్ల కర్ర ఈని, కంకులు వస్తున్నాయి అనే ఫిర్యాదు అందడంతో రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వ్యవసాయ యూనివర్సిటీ సిఫారసు మేరకు ఒక బస్తా యూరియాను వేసి, మరొక 7 నుండి 10 రోజుల వ్యవధిలో మరొక్క సారి ఇంకో బస్తా యూరియా చొప్పున వేసుకున్నట్లయితే నష్టాన్ని ఉందని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజు వ్యవసాయ విస్తరణ అధికారి భవాని, రైతులు శివకృష్ణ, ఉపేందర్, నాగయ్య పాల్గొన్నారు.