18-04-2025 01:50:41 AM
వసతి గృహ వార్డెన్ మార్తమ్మను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్
సూర్యాపేట జిల్లా ఆర్డీవో వేణుమాధవ్
తుంగతుర్తి ఏప్రిల్ 17 : తుంగతుర్తి ఎస్సీ బాలికల వసతి గృహం పై ఏసీబీ అధికారులు దాడి చేసిన సంఘటన విధితమే దీనితో జిల్లా కలెక్టర్ తేజస్ నందనాల్ పవర్ ఆదేశాల మేరకు ఆర్డిఓ వేణుమాధవ్ శుక్రవారం అకస్మాత్తుగా బాలికల వసతి గృహాన్ని సందర్శించి, వార్డెన్ మార్తమ్మ తో కలిసి, రికార్డులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రికార్డులో రాసిన విద్యార్థుల కన్నా ఎక్కువ మంది ఉన్నట్లు తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. వసతి గృహంలోని గదులు అపరిశుభ్రంగా ఉన్నాయని తెలిపారు. జరిగిన సంఘటనపై బుధవారం రోజున వసతి గృహ వార్డెన్ మార్తమ్మను జిల్లా కలెక్టర్, సస్పెండ్ చేసినట్లు సమాచారం.
వసతి గృహ పరిస్థితులు తప్పుల రికార్డులు జరిగిన సంఘటన పై జిల్లా కలెక్టర్ తన నివేదికను పంపనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ వసతి గృహ అధికారిని లత , తాసిల్దార్ దయానంద్, రెవెన్యూ అధికారులు అంజయ్య శ్రీనివాస్ సిబ్బంది, పాల్గొన్నారు.