29-04-2025 12:42:34 AM
ఖమ్మం రైల్వే అభివృద్ధి పనులను పరిశీలించి, అధికారులతో సమీక్షించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరావు
ఖమ్మం, ఏప్రిల్28 ( విజయక్రాంతి ):-ఖమ్మం రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వర రావు సోమవారం పరిశీలించారు. జరుగుతున్న పనుల పురోగతిపై స్థానిక రైల్వే స్టేషన్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి సమగ్ర వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మం రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఇప్పటికే సుమారు 50 శాతం వరకు పనులు పూర్తయ్యాయని తెలిపారు.
రూ. 25.41 కోట్ల వ్యయంతో జరుగుతున్న ఈ అభివృద్ధి పనుల్లో ఏసీ వేచియుండే గదులు, మె రుగైన శౌచాలయాలు, 12 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఎస్కలేటర్లు, లిఫ్టులు వంటి ఆధునిక సదుపాయాలు ప్రయాణికుల వినియోగానికి సిద్ధమవుతున్నట్లు వివ రించారు. పరిశీలన అనంతరం నిర్వహించిన సమీక్షలో రైల్వే అధికారులు స్టేషన్లో జరుగుతున్న ఇతర పనుల విషయాన్ని కూడా జిల్లా అధ్యక్షుడికి వివరించారు.
ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, కొత్త జనరల్ వెయిటింగ్ హాల్, రిటైరింగ్ గదులు, గోడల నిర్మాణాలు, ప్లాట్ఫారమ్ పై అదనపు కప్పు ఏర్పాట్లు, సి.ఓ.పి నిర్మాణాలు వంటి పనులు ప్రాధాన్యత పొందుతున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో గోంగూర వెంకటేశ్వర్లు, దొంగల సత్యనారాయణ, గుగులోతు నాగేశ్వరరావు, అల్లిక అంజయ్య, డోకుపర్తి రవీందర్ ,తోడుపునూరి రవీందర్ , రవి రాథోడ్, రేఖా సత్యనారాయణ ,నెల్లూరు బెనర్జీ ,గడీలనరేష్, అంకతి పాపారావు, మంద సరస్వతి, పిల్లలమర్రి వెంకట్, మాధవ్, మణి, వీరెల్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.