24-04-2025 12:17:13 AM
పటాన్ చెరు, ఏప్రిల్ 23 : జిన్నారం మండలం మాదారం గ్రామ శివారులోని కంకర క్రషర్లు నిబందనలు పట్టించుకోకుండా విచ్చల విడిగా జరుపుతున్న బ్లాస్టింగ్ లపై చర్యలు తీసుకోవాలని మాదారం గ్రామ పోరాట కమిటీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మైనింగ్ అధికారులు బుధవారం క్రషర్, క్వారీలను పరిశీలించారు. క్రషర్, క్వారీల అనుమతి, ఇతర పత్రాలను తీసుకొని సంగారెడ్డి రావాలని వాటి ప్రతినిధులకు మైనింగ్ రాయల్టీ ఇన్స్పెక్టర్ సైదులు సూచించారు.
కాగా క్రషర్, క్వారీలలో జరుగుతున్న అక్రమ మైనింగ్, బ్లాస్టింగ్స్, గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను పోరాట కమిటీ మైనింగ్ అధికారి సైదులుకు వివరించారు. స్పందించిన ఆయన నియమ నిబంధనలు పట్టించుకోని క్రషర్, క్వారీ యాజమాన్యాలపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు విజయ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి టీ రమణ సింగ్, దాసరి సాయికుమార్, వికాస్ సింగ్, అనీల్ కుమార్, నితిన్, గోపీ, రాజు, సంతోశ్ తదితరులు పాల్గొన్నారు.