04-03-2025 11:49:13 PM
మేడ్చల్ (విజయక్రాంతి): పిసిపిఎం డిటి చట్టం అమలు పర్యవేక్షణలో భాగంగా వాయుపురిలోని ప్యూర్ ఆర్థో, శ్రీ రక్ష ఆస్పత్రులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సీ.ఉమా గౌరీ మంగళవారం తనిఖీ చేశారు. ఆస్పత్రులలోని స్కానింగ్ యంత్రాలను, ధ్రువపత్రాలను, ఫామ్ ఎఫ్ నమోదు సహా పీ సిపిఎండిటి నిబంధనలకు అనుగుణంగా నిర్వహణ జరుగుతున్నదా అని పరిశీలించారు. ఫామ్ ఎఫ్ మీద రేడియోలజిస్ట్ సంతకం ఉండాలని, అన్ని పత్రాలు కనీసం రెండు సంవత్సరాలు భద్రపరచాలని ఆసుపత్రుల నిర్వాహకులకు సూచించారు. గర్భ నిర్ధారణ పద్ధతులను దుర్వినియోగం చేయవద్దన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.