calender_icon.png 24 January, 2025 | 5:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయిల్ పామ్ మిల్లు పనుల పరిశీలన

24-01-2025 12:00:00 AM

ఉద్యానవన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ భాష

గద్వాల, జనవరి 23 ( విజయక్రాంతి ) : జోగులంబా గద్వాల జిల్లాలోని ఎర్రవల్లి మండలం బీచుపల్లిలో గల ఆయిల్ పామ్ నర్సరీ మరియు ఆయిల్ పామ్  మిల్లుకు సంబంధించిన పనులను ఆయిల్ ఫెడ్ ఏం.డి. మరియు ఉద్యాన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ భాష గురువారం పరిశీలించారు. ఆయిల్ పేడ్ మరియు ఉద్యాన శాఖ అధికారులతో ఆయిల్ పామ్ తోటల విస్తీర్ణ మరియు ఉద్యాన శాఖ పధకాలు గురించి సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీచుపల్లి ఫ్యాక్టరీలో ఆయిల్ ఫామ్ పంట సాగుపై అవగాహన కల్పించేందుకు రైతులకు ఒక వేదిక ఏర్పాటు చేయాలని అధికారులకు ఈ సందర్భంగా ౠయన  సూచించారు. ఆయిల్ పామ్ పంటలతో పాటు వివిధ రకాల లాభసాటి అంతర్ పంటలపై రైతులకు అవగాహన కల్పించి అంతర్పంటలు వేసుకునే విధంగా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. 

తోట చుట్టూ శ్రీగంధ మొక్కలు నాటే విధంగా కృషి చేయాలని అన్నారు. అనంతరం ఆయిల్ పామ్ రైతులతో పంట సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు. తదనంతరం జిల్లాలో ఆయిల్ పామ్ సాగు, విస్తీర్ణం తదితర అంశాలపై కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ బి.యం.

సంతోష్ తో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎం.ఏ.  అక్బర్, ఆయిల్ ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి. ఉద్యానవన అధికారులు ఎం.రాజశేఖర్, మహేష్ ,ఇమ్రాన, ఆయిల్ ఫెడ్ జిల్లా ఇంచార్జి వి.వెంకటేష్ , క్షేత్ర స్థాయి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.