calender_icon.png 27 April, 2025 | 5:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల స్థలాల పరీశీలన

26-04-2025 10:17:22 PM

రేవల్లి: మండల కేంద్రం రేవల్లిలో శనివారం ఎంపీడీవో విజయ కుమార్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో భాగంగా ఇద్దరమ్మాయిల స్థలాలను పరిశీలించారు. పై అధికారుల ఆదేశాల మేరకు రేవల్లిలో దాదాపు 40 వరకు నూతన ఇందిరమ్మ ఇండ్ల సలాల పరిశీలించినట్లు ఈనెల చివరినాటికి తుది జాబితా సిద్ధం చేయనున్నట్లు, లబ్ధిదారులు వారి వారి కేటాయించుకున్న స్థలాల్లో నూతన ఇండ్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలనిఆయన సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు లబ్ధిదారులు ఎంపిక చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీవో నరసింహ, పంచాయతీ సెక్రెటరీ హరీష్ రెడ్డి, నాయకులు వాడాల పర్వతాలు, తోకల గుర్నాథ్ రెడ్డి, వాడల వెంకటయ్య, తప్ప రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.