calender_icon.png 18 April, 2025 | 2:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి లో ఐస్ క్రీమ్ పార్లర్, జ్యూస్ కేంద్రాల తనిఖీ

10-04-2025 05:12:07 PM

తనిఖీలు చేపట్టిన ఆహార భద్రతశాఖ అధికారులు..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న ఐస్ క్రీం పార్లర్స్, జ్యూస్ కేంద్రాలను ఆహార భద్రత అధికారులు డా.శిరీష, సునీత లు గురువారం తనిఖీలు చేపట్టారు. తనిఖీ సమయంలో కొన్ని గడువు ముగిసిన ఆహార పదార్ధాలు లభించాయి. వాటిని వెంటనే పార వేయించారు. ఐస్ క్రీం, జ్యూస్ తయారీ ప్రాంతంలో పరిశుభ్రత లేని కారణంగా వారికి నోటీసులు జారి చేశారు. ఆహార పదార్థాల విక్రయాలు చేపట్టే  నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఆహార భద్ర తా పదార్థాల వద్ద పరిశుభ్రత మీద అవగాహన కల్పించారు. అపరిశుభ్రంగా ఉంచుకుంటే కేసులు నమోదు చేసి దుకాణాలను సిల్ చేస్తామని హెచ్చరించారు.