calender_icon.png 7 March, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేపల చెరువు నిర్మాణ పనుల పరిశీన

07-03-2025 12:00:00 AM

ఎల్లారెడ్డి మార్చి 6 (విజయక్రాంతి):  కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల పరిధిలోని శబ్దల్ పూర్ గ్రామంలో నిర్మిస్తున్న చేపల చెరువు నిర్మాణ పనులను గురువారం నాడు ఎల్లారెడ్డి ఎంపీడీవో ప్రకాష్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేపల పెంపకం ద్వారా ఉపాధి పొందేందుకు పేదలకు మంచి అవకాశం ఉందని, చేపల పెంపకానికి ఆసక్తి చూపేవారికి కావాల్సిన చేయూతను అందిస్తూ ప్రభుత్వం సహకరిస్తుందన్నారు.

ఎటువంటి ఉపాధి మార్గం లేని వారు ఇలాంటి స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో వినోద్ పంచాయతీ కార్యదర్శి సునంద ఫీల్ అసిస్టెంట్ సాయిలు తదితరులు పాల్గొన్నారు.