calender_icon.png 29 March, 2025 | 6:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎరువుల దుకాణాల తనిఖీ

26-03-2025 05:44:34 PM

లక్షెట్టిపేట (విజయక్రాంతి): ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీకాంత్ స్టార్ స్పోర్ట్స్ అధికారులు సంయుక్తంగా బుధవారం తనిఖీ చేశారు. పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలు, ట్రేడర్స్ లలో నిల్వలను తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని డీలర్లను హెచ్చరించారు. రసీదు లేకుండా అమ్మితే చట్టపరమైన చర్యలు తప్పవు అని అన్నారు. ఈ తనిఖీల్లో  సిఐ నరేందర్, తహసిల్దార్ దిలీప్ కుమార్, సంబంధిత అధికారులు ఉన్నారు.