calender_icon.png 4 February, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనుల పరిశీలన

03-02-2025 11:51:51 PM

మలక్‌పేట: ఆజంపురా డివిజన్ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు అధికారులు, ఎంఐఎం పార్టీ నేతలు పరిశీలించారు. ఆజంపురా డివిజన్‌లోని మిలాద్ గల్లీలో మంచినీటి, సీవరేజీ లైన్, సీసీ రోడ్డు పనులు, చాదర్‌ఘాట్ చమన్ సుందరీకరణ పనులు, రోడ్డు వెడల్పు పనులు, చంచల్‌గూడ ఎంఐఎం పార్టీ నేత షేక్ మోహియుద్దీన్ అబ్రార్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అబ్రార్ మాట్లాడుతూ.. డివిజన్‌లో ఎమ్మెల్యే అహ్మద్ బలాల చొరవతో అనేక అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. ప్రజలకు కాల్సిన సదుపాయాలను కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.