calender_icon.png 21 February, 2025 | 11:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమీకృత మార్కెట్ సముదాయ నిర్మాణ పనుల పరిశీలన

19-02-2025 01:24:11 AM

వనపర్తి, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): ఖిల్లా ఘనపురం మం డల కేంద్రంలో నిర్మిస్తున్న నూతన సమీకృత మార్కెట్ సముదా య నిర్మాణం పనులను మంగళవారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ... మండల కేంద్రంలోని ఈ మార్కెట్ ఉపయోగం లోకి వస్తే  ఎంతోమంది చిరు వ్యాపారులకు దోహదపడుతుందన్నారు.

వన పర్తి జిల్లా కేంద్రానికి, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి మధ్య లో ఉండే ఖిల్లా ఘనపురం మండల కేంద్రం అన్ని రకాల వ్యాపా రాలకు నెలువుగా ఉంటుందని, గ్రామీణ ప్రాంతాల వారికి, గిరిజ నులకు ఇక్కడ  వ్యాపారాలు చేసుకోవడానికి అనువుగా ఉంటుం దని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.

వ్యాపారాలకు అణువుగా ఉం డే ఈ మండల కేంద్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ  వెంక టయ్య, మాజీ జెడ్పిటిసి  సోలిపురం రవీందర్ రెడ్డి, వెంక ట్రావు, సాయి చరణ్ రెడ్డి,  యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు నవీన్ రె డ్డి, ప్రకాష్, రాజు, రమేష్, జయాకర్, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.