calender_icon.png 3 April, 2025 | 10:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలన

03-04-2025 12:29:50 AM

అదనపు కలెక్టర్ నర్సింగ రావు

గద్వాల, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): గద్వాల మండలంలోని నల్లదేవుని గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు, పురోగతిని బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్మాణపు పనులన్నింటినీ నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. నిర్మాణ నాణ్యతపై రాజీపడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

చేపడుతున్న పనులపై సంబంధిత అధికారులకు తగు సలహాలు, సూచనలు అందజేశారు. అనంతరం లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి, నిర్మాణంలో ఉన్న గృహాలకు సంబంధించి వారి సమస్యలు, సూచనలు తెలుసుకున్నారు.

బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తయిన పనులకు అవసరమైన లక్ష రూపాయలను వెంటనే అందజేసేందుకు నిధులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఉమా దేవి, సంబంధిత శాఖల అధికారులు, గ్రామ ప్రజలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.