29-03-2025 08:23:52 PM
ఎల్బీనగర్: బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సాయి గార్డెన్స్ కాలనీలో రూ.14 లక్షలతో చేపట్టిన రోడ్లు పనులను ఆదివారం కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, డీఈ దామోదర్ రావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. రోడ్డు పనుల్లో నాణ్యత పాటించాలని, త్వరగా రోడ్డు పనులు పూర్తి చేయాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో ఇంజినీర్ దేవి రాజ్ కుమార్, కాలనీ సంఘం అధ్యక్షుడు డాక్టర్ గన్నా, మహిళా నాయకురాలు భ్రమరాంబ, కాలనీ సభ్యులు ఓం ప్రకాశ్, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ ఉన్నారు.