21-03-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
హనుమకొండ, మార్చి 20( విజయ క్రాంతి): వరంగల్ నగరంలోని భద్రకాళి చెరువులో కొనసాగుతున్న పూడికతీత పనులను సంబంధిత శాఖల అధికారులతో కలిసి హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య గురువారం కలిసి పరిశీలించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే, జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డిలతో కలిసి పూడికతీత పనుల పురోగతి గురించి సాగునీటిపారుదల శాఖ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, ఈ ఈ శంకర్ లను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటివరకు జరిగిన పూడికతీత గురించిన వివరాలను కలెక్టర్ ఆరా తీశారు.ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ పూడి కతీత పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. మట్టి తరలించేందుకు చెరువు మార్గంలో వీలైనన్ని అంతర్గత దారులు మరి న్ని ఉండేలా చర్యలు చేపట్టి త్వరగా ఎక్కువ సంఖ్యలో వాహనాల ద్వారా మట్టి తరలింపును చేయించాలన్నారు.
ఏవైన ఇబ్బందులు ఉన్నట్లయితే తమ దృష్టి తీసుకురావాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా కుడా పీవో అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో భద్రకాళి చెరువు పూడికతీత పనులు, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో నిర్వర్తించాల్సిన బాధ్యతలపై జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో సాగునీటిపారుదల శాఖ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, ఈఈ శంకర్ మాట్లాడుతూ పూడికతీత మట్టిని తరలించేందుకు వెహికల్ పాసులు జారీ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రవేశం, వెలుపలికి వెళ్లే మరో దారిని ఏర్పాటు చేస్తే ఇబ్బందులు ఉండవని అన్నారు. రాత్రి వేళలో మట్టిని తరలించేందుకు అదనపు సిబ్బందినిపర్యవేక్షించేందుకు కేటాయించాలన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ పూడికతీత మట్టిని తరలించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంతర్గత రహదారిని ఒక్కరోజు లోనే పూర్తయ్య విధంగా అధికారులను ఆదేశించారు. సిబ్బంది పర్యవేక్షణ కోసం రెండు రోజుల్లో పెద్ద కంటైనర్ ఏర్పాటు తాగునీరు, కుర్చీలు సమకూర్చాలని పేర్కొన్నారు.
విడతల వారీగా విధులు నిర్వర్తించేందుకు అక్కడ తగిన సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు.కౌంటర్లను ఏర్పాటుచేసి ఇబ్బందులు రాకుండాచూ సుకో వాలన్నారు. రాత్రివేళ విధులు నిర్వర్తించేందుకు అదనపు సిబ్బందినియమించా లన్నా రు. రెండు నీటి ట్యాంకర్లను అందుబాటులో ఉంచాలన్నారు. వీలైనన్ని విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలన్నారు.
మట్టి తరలింపునకు ఒకే వైపు కాకుండా మరో మార్గం ద్వా రాతరలించేందుకు ప్రత్యామ్నాయ రోడ్డును సిద్ధం చేయాలన్నారు. సోమవారం నుండి రాత్రి వేళల్లోనూ మట్టిని తరలించేలా చర్య లు చేపట్టాలని అన్నారు. టెండర్ దారులు ఎంత త్వరగా మట్టిని తరలిస్తే అంత మంచిదని అన్నారు. అధికారులు, టెండర్ దారులు సమన్వయంతో త్వరగా పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్న టెండర్ దారులతో మట్టి తరలింపునకు సంబంధించి కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, కుడా పీవో అజిత్ రెడ్డి, ఏసీపీలు దేవేందర్ రెడ్డి, సత్యనారాయణ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నాగబాబు, ఎంవీఐ వేణుగోపాల్, భద్రకాళి చెరువు పూడికతీత మట్టి టెండర్ దారులు పాల్గొన్నారు.