calender_icon.png 15 October, 2024 | 6:47 PM

భువనగిరి హోటల్ వివేరా లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ

15-10-2024 04:37:30 PM

యాదాద్రి భువనగిరి (విజయక్రాంతి): భువనగిరి పట్టణంలోని వివేరా హోటల్ పై ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డాక్టర్ ఎం సుమన్ కళ్యాణ్ మరియు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్వాతి గార్లు  వినియోగదారుడు ఫిర్యాదు మేరకు ఆకస్మికంగా దాడులు జరిపారు. ఈ హోటల్ పై షెడ్యూల్ 4 ప్రకారము తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్రత గమనించి నోటీసు ఇచ్చారు, హోటల్ వంటగదిని, స్టోర్ రూమ్, పరిశీలించారు. తాజా కూరగాయలను, గుర్తింపు పొందిన నూనె, పప్పులు, పిండి మొదలగు పదార్థాలను గడువు కాకముందే వాడాలని, గడువు తేది లేని కూల్ డ్రింక్స్ ను ధ్వంసం చేశారు. తయారుచేసిన ఆహార పదార్థాలు ఈగలు, దోమలు, బొద్దింకలు పడకుండా శుభ్రంగా ఉంచాలని, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను వాడకూడదని, తాజ ఆహార పదార్థాలని ప్రజలకు అందించాలని లేనిచో చట్టపరమైన చర్యలు తప్పవని హేచ్చరించారు. వారి దగ్గర నుంచి శాంపిల్స్ సేకరించి హైదరాబాదులోని టెస్టింగ్ ల్యాబ్ కు పంపించారు. సేకరించిన ఆహార శాంపుల్స్ కల్తీ అని తేలినట్లయితే దాని  ఆధారంగా చట్టపరమైన చర్యలు ఉంటాయని ప్రజలకు అందించే ఆహారపదార్థాలు కల్తీ లేకుండా ఆరోగ్యకరంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ హేచ్చరించారు.