calender_icon.png 27 January, 2025 | 9:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ చైతన్య కాలేజీ కిచెన్‌‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

26-01-2025 11:54:46 AM

శేరిలింగంపల్లి, (విజయక్రాంతి): మాదాపూర్ డివిజన్ అయ్యప్ప సొసైటీలోనీ శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్(Sri Chaitanya Educational Institute)లో శనివారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడమే కాకుండా సెంట్రల్ కిచెన్ లో పురుగులు, బొద్దింకలు, ఎలుకలతో పాటు కాలం చెల్లిన ఆహార పదార్థాలు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. శ్రీ చైతన్య కాలేజీ(Sri Chaitanya) నిర్వాకంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షలు ఖర్చు చేసి తమ పిల్లలను కాలేజీలో చేరిస్తే కనీస బాధ్యత, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఆహారం వండి పెడతారా అంటూ మండిపడుతున్నారు. పిల్లలకు పెట్టే ఆహారం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన శ్రీ చైతన్య యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.దీంతో శ్రీ చైతన్య కాలేజీకి నోటీసులు ఇచ్చినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు(Food Safety Authorities) తెలిపారు.