నిర్మల్, నవంబర్ 29 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫినగర్ జనరల్ గురుకుల పాఠశాలను శుక్రవారం గురు కుల విద్యా లయాల ముఖ్య కార్యదర్శి రమణకుమార్ తనఖీ చేశారు. వంట గదులు, కూరగాయాలు, శుభ్రతను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా అని తెలుసుకున్నారు.
విద్యా బోధన, తర గతుల నిర్వహణ, వైద్య పరీక్షలు తదితర అంశాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు చక్కగా పని చేయాలని సూచించారు. భోజ నం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.