30-04-2025 01:11:19 AM
ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్, ఏప్రిల్ 29(విజయక్రాంతి): ఇందూర్ నగరం లోని గంగస్థాన్ పేస్ 1 లో జరుగుతున్నా భూగర్భ మురుగునీటి జలాల పనుల తోపాటు మురుగు నీటి శుద్ధికరణ కర్మాగారాన్ని అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ ప్రజా ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే సూర్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర ,రాష్ర్ట ప్రభుత్వల నుండి ఇందూర్ కార్పొరేషన్ కి అమృత్ -2 పథకం ద్వారా ఇందూర్ నగరానికి భూగర్భ మురుగు నీటి జలాల అభివృద్ధి, వాటర్ వర్క్స్ పనులకు సుమారు 400 కోట్లు విడుదల కావడం జరిగింది అన్నారు. భూగర్భ మురుగు నీటి జలాల పనులలో భాగంగా నగరంలో 150 మాన్ హోల్స్ పునః నిర్మాణం చేసినట్లు అలాగే 45 కొత్తవి నిర్మాణం చేసినట్లు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఒక కిలోమీటర్ పైప్ లైన్ వేయడం జరిగిందన్నారు.
నగరంలో భూగర్భ మురుగు నీటి జలాల పనులు నత్తనడకన నడుస్తున్నాయని ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేసారు. వర్షా కాలన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలేత్త కుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు త్వరగా నాణ్యతతో పూర్తి చేయాలనీ అధికారులకు, కాంట్రాక్టర్ లకు సూచించారు.
అర్బన్ నియోజకవర్గంలో రాబోయే ఏడాదిన్నార కాలంలో ప్రతి ఇంటికి డ్రైనేజీ కనెక్షన్ ఇచ్చి నగరంలో డ్రైనేజీ సమస్య తీరుస్తాం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డి ఈ నగేష్ రెడ్డి, సాయి చంద్,బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోల్ల లక్ష్మి నారాయణ గారు, బీజేపీ కంటేశ్వర్ మండల అధ్యక్షులు ఆనంద్ రావు, బీజేపీ నాయకులు సాయి ప్రవీణ్, మఠం పవన్, ఆనంద్,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.