calender_icon.png 25 February, 2025 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దోమకొండ ఏఈకి ఉత్తర విద్యుత్ సంస్థ ఎస్‌ఈ ఆదేశాలు

25-02-2025 01:54:31 AM

కామారెడ్డి, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి),: ప్రమాదాలు జరిగితేనే స్పందిస్తారా అనే కథనం సోమవారం విజయక్రాంతి దినపత్రిక లో ప్రచురితం  కావడంతో తెలంగాణ ఉత్తర విద్యుత్ సమస్త ఎస్‌ఈ శ్రావణ్‌కుమార్ సోమవారం స్పందిం చారు. ప్రమాద భరితంగా ఉన్న విద్యుత్ స్తంభం పరిశీలించి నివేదిక అందజేయాలని దోమకొండ ఏఈ కి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. త్వరలోనే విద్యుత్ స్తంభాన్ని తొలగించి నూతన విద్యుత్ స్తంభాన్ని అమరుస్తామని ఎస్ ఈ శ్రావణ్ కుమార్ విజయ క్రాంతి తో తెలిపారు.

గ్రామస్తులు ఎన్నోసార్లు విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్పందించలేదని గ్రామస్తులు తెలిపారు. విజయ క్రాంతి దినపత్రిక లో వచ్చిన కథనం చూసి ఎస్ ఈ శ్రావణ్ కుమార్ స్పందించడం అభినందనీయమని గ్రామస్తులు తెలిపారు. దోమకొండ మటన్ మార్కెట్ వద్ద ప్రమాద భరితంగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని తొలగించి దాని స్థానంలో నూతన విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు.