08-02-2025 01:41:28 AM
* కూకట్పల్లిలో స్లీప్ థెరప్యూటిక్స్ క్లినిక్ ప్రారంభం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 7(విజయక్రాంతి): మారుతున్న జీవనశైలి, ఆహా రపు అలవాట్లు, యాంత్రిక జీవనం కారణం గా చాలా మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారని స్లీప్ థెరప్యూటిక్స్ వ్యవస్థాపకురాలు, ఇంటర్వెన్షనల్ పల్మోనాలజిస్ట్ స్లీప్ స్పెషలిస్ట్ డాక్టర్ హర్షిణి ఎర్రబెల్లి పేర్కొన్నారు.
అవగాహన లేమి దృశ్యా అందుబా టులో ఉన్న చికిత్సల గురించి ఎవరికీ తెలియడం లేదన్నారు. అత్యాధునిక, ప్రత్యేక వై ద్య సదుపాయాలతో ఉన్న స్లీప్ థెరప్యూటిక్స్‌లో నిద్ర రుగ్మతలతో బాదపడుతున్న వా రికీ చికిత్సను అందిస్తున్నట్లు వివరించారు.
స్లీప్ థెరప్యూటిక్స్ మొదటి బ్రాం జూబ్లీహి ల్స్‌లో స్థాపించామని, తమ రెండో బ్రాంచ్ ను కూకట్పల్లిలో శుక్రవారం ప్రారంభిం చారు. ఫ్లోరెన్స్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ లోరెంజో కార్బెట్టా, బోలోగ్నా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ పియరో కాండోలి, మాజీ ఎంపీ బోయనపల్లి వినోద్ కుమార్, కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు పాల్గొన్నారు.