అమెరికన్ నివేదిక ప్రకారం.. ప్రతి ముగ్గురిలో ఒకరూ నిద్రలేమితో బాధపడుతున్నారు. చాలామంది నిద్రలేమితో బాధపడు తున్నప్పటికీ, పురుషుల కంటే మహిళలకు ఎక్కువ ప్రమాదం ఉంది. అయితే ఈ సమస్య మహిళల్లో 58శాతం ఎక్కువగా ఉంది. హార్మోన్ల హెచ్చుతగ్గుదలు కూడా నాణ్యమైన నిద్రను దెబ్బతీస్తున్నాయి. అలాగే పీరియడ్స్, గర్భధారణ లాంటివి మహిళల్లో నిద్రలేమికి దారితీస్తున్నాయని పలు సర్వేలు తేల్చి చెబుతున్నాయి. అలాగే మెనోపాజ్ కారణంగానూ నిద్రకు దూరమవుతున్నారట.
ప్రస్తుత బిజీలైఫ్ లో మహిళలు ఒకవైపు ఆఫీస్, మరోవైపు ఇంటి పనులతో రోజంతా అవిశ్రాంతంగా పనిచేస్తుండటం వల్ల తగిన నిద్రకు నోచుకోలేకపోతున్నారు. పరిస్థితులు, కారణాలు ఏమైనా మగవారితో పోలిస్తే మహిళలు మాత్రమే నిద్రలేమితో బాధపడుతున్నారు. కాబట్టి మహిళలు రోజువారీ పనులను ఓ పద్ధతి ప్రకారం చేసుకుంటూపోతే నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టొచ్చు.