calender_icon.png 20 September, 2024 | 5:26 AM

సృజనాత్మకతను వెలికితీసేందుకే ‘ఇన్‌స్సైర్’

19-09-2024 12:15:04 AM

డీఈవో రోహిణి

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 18(విజయక్రాంతి): విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకే ‘ఇన్‌స్సైర్ అవార్డ్స్ మానక్’ను నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ డీఈవో ఆర్.రోహిణి అన్నారు. ఇన్‌స్పైర్ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 15వరకు గడువు పొడిగించినట్లు బుధవారం ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్‌స్సైర్ కోసం ప్రతీ పాఠశాల నుంచి 5ప్రాజెక్టులను inspire awards--dst.gov.in అనే వెబ్‌సైట్‌లో, గూగుల్ ప్లే స్టోర్‌లో ఇన్‌స్సైర్ మానక్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని విద్యార్థుల ఆవిష్కరణల వివరాలను నమో దు చేసుకోవచ్చిని డీఈవో సూచించారు. డిప్యూటీ ఈవోలు, విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, గైడ్ టీచర్లు విద్యార్థులను గైడ్ చేయాలని కోరారు.  మరిన్ని వివరాల కోసం జిల్లా సైన్స్ అధికారి సి.ధర్మేందర్‌రావ్‌ను 77991 71277 నంబర్‌లో సంప్రదించవచ్చని సూచించారు.