మహబూబ్నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ
మహబూబ్నగర్, మే 11 (విజయక్రాంతి): పాలమూరు ప్రజలతో తనది విడదీయలేని అనుబంధం అని మహబూబ్నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్లో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిత్యం పాలమూరు కోసం ఆలోచించే తనను ఒక మహిళ అని చూడకుండా కాంగ్రెస్ నాయకులు, సీఎం రేవంత్ రెడ్డి నీచంగా మాట్లాడుతున్నారని, తనను అంటే పాలమూరు ఆడబిడ్డలను అందరినీ అవమానించినట్లేనన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని పేర్కొన్నారు. తనను ఓడించేందుకు సీఎం పాలమూరుకు ఏడుసార్లు వచ్చారంటేనే కాంగ్రెస్కు ఓటమి భయం పట్టుకుందని అర్థమవుతుందని, వారు ఎన్ని కుట్రలు చేసినా తన గెలుపును ఆపలేరని అన్నారు. సమావేశంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.