- జలప్రవేశానికి సిద్ధమైన న్యూక్లియర్ సబ్‌మెరైన్
- వైజాగ్‌లోనే నిర్మాణం
న్యూఢిల్లీ, ఆగస్టు 11: భారత అమ్ముల పొదిలో మరో శక్తిమంతమైన జలాంతర్గామి చేరనున్నది. అణుశక్తితో నడిచే ఐఎన్‌ఎస్ అరిఘాత్ జల ప్రవేశానికి సిద్ధమైంది. అత్యాధునికమైన ఈ జలాంతర్గామి విశాఖప ట్టణంలోని షిప్ బిల్డింగ్ సెంటర్‌లోనే రూపు దిద్దుకోవటం విశేషం.
చైనాకు చెక్
విస్తరణ కాంక్షతో అనేక దేశాల ప్రాదేశిక జలాల్లోకి దూసుకొస్తున్న చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ నేవీని బలోపేతం చేస్తోంది. అమెరికాను మించి చైనా యుద్ధ నౌకలు, జలాంతర్గాములను నిర్మిస్తుండటంతో ఎప్పటికైనా ముప్పేనని గుర్తించిన భారత్.. అత్యాధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చుకొంటున్నది. అందులో భాగంగానే రెండు అణు జలాంతర్గాముల నిర్మాణం చేపట్టింది. అందులో ఐఎన్‌ఎస్ అరిఘాట్ రెండోది.
ఐఎన్‌ఎస్ అరిఘాత్ విశేషాలు
- ప్రాజెక్టు 77 కింద ఈ అణు జలాంతర్గాములను నిర్మించారు.
- ఈ ప్రాజెక్టు వ్యయం రూ.40 వేల కోట్లు.
- ఇవి హంటర్ కిల్లర్ సబ్‌మెరైన్స్. వీటిని ఎస్‌ఎస్‌ఎన్ అని పిలుస్తారు.
- ఐఎన్‌ఎస్ అరిఘాత్ బరువు 6 వేల టన్నులు.
- వీగిలో 95 శాతం దేశీయ సాంకేతికతనే వాడారు.
- ఐఎన్‌ఎస్ అరిఘాత్ అణుశక్తితో నడుస్తుంది.
- ఇది అణ్వాయుధాలను కూడా ప్ర యోగించగలదు. జల, వాయు, భూ మార్గాలపై ఉన్న లక్ష్యాలను చేధించగల క్షిపణులను మోసుకెళ్తుంది.
- ఇందులో 750 కిలోమీటర్ల రేంజ్ ఉన్న కేయూ క్షిపణులను అమర్చుతారు.