- వినతులు స్వీకరిస్తాం..
- రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్
కామారెడ్డి, అక్టోబర్ 29 (విజయక్రాంతి): రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లు తేల్చేందుకే ఉమ్మడి జిల్లాల్లో విచారణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర బీసీ కమి షన్ చైర్మన్ నిరంజన్ అన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్‌లో మంగళవారం ప్రజాప్రతి నిధులు, పలు బీసీ సంఘాల సభ్యులతో నిర్వహించిన విచారణలో ఆయన మాట్లాడారు.
ప్రజాప్రతినిధులు, ప్రజాభిప్రాయాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. నిజామాబాద్ రూరల్ భూపతిరెడ్డి మాట్లాడుతూ.. బీసీల కుల గణన వారి వాస్తవ స్థితిగతులపై జరగాలని సూచించారు. తెలంగా ణ ఏర్పడిన తరువాత బడుగూ బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆశించినప్పటికీ అలా జరగలేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేసేందుకే బీసీ కమిషన్‌ను నియమించిందన్నారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు అన్ని రంగాల్లో న్యాయం జరిగేలా చూస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు దక్కాల్సి ఉందన్నారు. అందుకు అనుగుణంగానే నిధుల వాటా ఉండాలన్నారు.
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారి కోసం అన్నిజిల్లాల్లో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలన్నారు. బీజేపి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్‌కర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం బీసీలను నమ్మించి గొంతు కోసిందన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకా రం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలన్నారు. అనంతరం పలు బీసీ సంఘాల నేత లు తమ డిమాండ్లపై బీసీ కమిషన్ సభ్యులకు వినతి పత్రాలు అందించారు.