హైదరాబాద్: ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఛార్జిషీట్ పై మంగళవారం విచారణ జరగనుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఛార్జిషీట్ ను పరిగణలోకి తీసుకోవడంపై కోర్టు విచారణ చేపట్టనుంది. ఈడీ ఛార్జిషీట్ పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఈ విచారణ జరగనుంది. మే 10 తేదీన కవితపై ఈడీ 200 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఛార్జిషీట్ లో గోవా ఆప్ అసెంబ్లీ ప్రచారం చేసిన వ్యక్తుల పేర్లు ఉన్నట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 15న హైదరాబాద్ లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.