హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిటిషన్ పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో శుక్రవారం విచారణ జరిగింది. కౌంటర్ దాఖలుకు విజయమ్మ, షర్మిల తరుపు న్యాయవాది సమయం కోరారు. దీంతో ఎన్సీఎల్ టీ విచారణను వచ్చే నెల 13కు వాయిదా వేసింది. సరస్వతి పవర్ కంపెనీలో షేర్లు బదిలీపై ఎన్ సీఎల్ టీలో జగన్ పిటిషన్ వేశారు. తనకు తెలియకుండా తల్లి, చెల్లి షేర్లు బదిలీ చేసుకున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. విజయమ్మ, షర్మిల, జనార్దన్ రెడ్డిని జగన్ ప్రతివాదులుగా పేర్కొన్నారు. షేర్లు బదిలీ ఫారాలు సమర్పించకుండా తమ పేరిట మార్చుకున్నారని జగన్ ఆరోపించారు. జగన్, భారతి, క్లాసిక్ రియాల్టీ పేరిట షేర్లు కొనసాగేలా ఆదేశించాలని పిటిషన్ వేశారు. 51.01 శాతం షేర్లు యథావిధిగా కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో జగన్ పేర్కొన్నారు.