calender_icon.png 25 September, 2024 | 8:01 AM

హెల్త్ అసిస్టెంట్లపై విచారణ

25-09-2024 01:27:48 AM

  1. జాబ్‌చార్ట్ వారీగా నివేదిక ఇవ్వండి
  2. డిప్యూటీ వైద్యాధికారికి జిల్లా వైద్యాధికారిణి ఆదేశం

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లాలోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల హెల్త్ అసిస్టెం ట్టు విధులకు డుమ్మాకొట్టి, ప్రైవేటు క్లినిక్‌లు, ఇతర వ్యాపారాలు చేసుకుంటున్న వారిపై  విజయక్రాంతిలో ‘ప్రభుత్వ జీతం.. ప్రైవేటు వ్యాపకాలు’ శీర్షికన మంగళవారం కథనం ప్రచురితమైంది.

దీనిపై జిల్లా వైద్యాధికారిణి స్వరాజ్యలక్ష్మి స్పందించారు. జాబ్‌చార్ట్ వారి గా సంపూర్ణ నివేదికను కోరుతూ డిప్యూటీ వైద్యాధికారిని ఆదేశించారు. సక్రమంగా వి ధులకు హాజరుకానికి వారిని తన కార్యాలయానికి పిలిచి మందలించారు. ఇక నుంచి ముందస్తు అనుమతులు లేకుండా విధులకు గైర్హాజరైతే క ఠినంగా వ్యవహరించాల్సి ఉంటు ందని హెచ్చరించినట్లు తెలిసింది.

కాగా విజయక్రాంతి కథనంతో పనిదొంగలు కంగారు పడ్డారు. వాట్సాప్, సోష ల్‌మీడియాలో పాఠకులు ప్రచారం చేయడ ంతో వారిలో మరింత గుబులు మొదలైంది. దీంతో వారి వ్యక్తిగత గ్రూపుల్లో కనీసం మూ డురోజులైనా డ్యూకి వెళ్లి ఫొటోలు తీసి గ్రూ పులో పోస్టు చేయాలని చర్చించుకోవడం వి శేషం. కాగా కోడేరు పీహెచ్‌సీ వైద్యుడు డ్యూ టీకి రాకుండా పనిచేస్తున్న వారిని వేధించడ ంపై జిల్లా అధికారులు మొమో జారీ చేశా రు. సదురు వైద్యుడిపై కలెక్టరుకు జిల్లా వై ద్యాధికారిణి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిసింది.