calender_icon.png 24 October, 2024 | 2:01 AM

శ్రీచైతన్య విద్యాసంస్థలలో ఫీజుల దోపిడీపై ఈడీ, సీబీఐ దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టాలి

29-08-2024 03:22:40 PM

 పీ.డీ.ఎస్.యు నాయకుల డిమాండ్

కరీంనగర్, (విజయక్రాంతి): శ్రీచైతన్య విద్యా సంస్థలలో ఫీజుల దోపిడీ పై ఈడి ,సిబిఐ దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టాలనీ పీ.డీ.ఎస్.యు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్ డిమాండ్ చేశారు. గురువారం కరీంనగర్ ప్రెస్ భవన్ లో పీ.డీ.ఎస్.యు నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పీ.డీ.ఎస్.యు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతి లేకుండా కరీంనగర్ ముకరాంపూర్ లో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న శ్రీచైతన్య పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించగా తొమ్మిదిమందివిద్యార్థి నాయకుల పై పోలీసులతో అక్రమంగా కేసులు బనాయించడం సిగ్గు చేటన్నారు. విద్యాశాఖ అనుమతులు లేకున్నా శ్రీచైతన్య పాఠశాల నిర్వహిస్తుంటే జిల్లా డీఈవో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

తక్షణమే ఈ పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు .అనుమతి లేనిదే పాఠశాల నిర్వహిస్తే చూస్తూ ఊరుకోబోమని ద్వజమెత్తారు.ఫీజుల కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడితే ఉపేక్షించమన్నారు.తక్షణమే శ్రీచైతన్య యాజమాన్యం విద్యార్థి నాయకుల పై మోపిన అక్రమ కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం శ్రీచైతన్య విద్యా సంస్థలలో ఫీజుల దోపిడీ పై ఈడి, సిబిఐ దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టాలని కోరారు.అదే విధంగా  దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్వాడీ సుదర్శన్ మాట్లాడుతూ శ్రీచైతన్య విద్యా సంస్థలలో విద్యార్థుల మరణాల పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. 2025-2026 విద్యా సంవత్సరంలో ఈ విద్యా సంస్థల్లో అడ్మిషన్లను నిలిపి వేసేలా విద్యా శాఖను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించాలని,ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో పీ.డీ.ఎస్.యు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కూతాటి రాణా ప్రతాప్ మరియు జిల్లా ఉపాధ్యక్షుడు రవితేజ,నాయకులు బాబు,రాకేష్, అశ్లాం, అజ్ఞాన్, సమీర్, రోహిత్, ప్రీతం, సాద్విక్ తదితరులు పాల్గొన్నారు.