calender_icon.png 16 January, 2025 | 6:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ కొనుగోలుపై హైకోర్టులో విచారణ

12-09-2024 04:20:03 PM

హైదరాబాద్: ఛత్తీస్ గడ్ నుంచి విద్యుత్ కొనుగోళ్ల విషయంలో గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఛత్తీస్ గడ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి బకాయిలు చెల్లింపుపై వివాదం నెలకొంది. విద్యుత్ కొనుగోలు బిడ్ లో పాల్గొనకుండా అడ్డుకున్న నేషనల్ డిస్పాచ్ సెంటర్ రూ.261 కోట్లు బకాయిలు చెల్లించాలని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఫిర్యాదులో పేర్కొంది. డిస్కమ్ లు విద్యుత్ బిడ్లలో పాల్గొనకుండా నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ చేసింది. విద్యుత్ కొనుగోలుకు బిడ్లు వేయకుండా పవర్ ఎక్స్ చేంజీలు నిలిపివేసిన్నాయి.

గత్యంతరం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయంతో ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ రోనాల్డ్ రోస్ వాదనల కోసం హైకోర్టుకు వెళ్లింది. వివాదంపై ఇప్పటికే సీఈఆర్సీని తెలంగాణ డిస్కమ్ లు ఆశ్రయించడంతో వివాదం సీఈఆర్సీ పరిధిలో ఉందని ప్రభుత్వం కోర్టు తెలపనున్నది. వివాదం సీఈఆర్సీ పరిధిలో ఉండగానే పవర్ గ్రిడ్ నిర్ణయం తీసుకున్నదని వాదించడంతో రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలుపనుంది.