calender_icon.png 22 January, 2025 | 7:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిడ్నీ మార్పిడి రాకెట్‌పై ప్రత్యేక విచారణ కమిటీ

22-01-2025 05:04:05 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): నగరంలో కీడ్నీ రాకెట్‌(Kidney Scam) కలకలం రేపింది. సరూర్ నగర్ లోని అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడిలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో పోలీసులు, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి రంగంలోకి దిగారు. ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి రాకెట్ బట్టబయలు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఈ వ్యవహారంపై ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ బెజంశెట్టి నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికే ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించింది. తదుపరి దర్యాప్తు కోసం గాంధీ ఆసుపత్రిలో బాధితులను కలవనున్నట్లు సమాచారం. కిడ్నీ మార్పిడి రాకెట్ వ్యవహరంపై డాక్టర్‌ నాగేంద్ర కమిటీ ఇవాళ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(Director of Medical Education)కి సమగ్ర నివేదికను సమర్పించనుంది. కుటుంబ ఆర్థిక ఇబ్బందులతో తమినాడు, కర్నాటకకు చెందిన ఇద్దరు వితంతువులు కీడ్నీలు విక్రయించేందుకు ఈనెల 17న అలకనంద అసుపత్రిలో చేరినట్లు అధికారులు గుర్తించారు. 

ఆసుపత్రిలో కీడ్నీ శస్త్ర చికిత్స జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఆసుపత్రి లోపల నలుగురిని గుర్తించిన పోలీసులు, వారిలో ఇద్దరు దాతలుగా, మరో ఇద్దరు గ్రహీతలుగా భావిస్తున్నారు. డా.నాగేంద్రర్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల కమటీ కీడ్నీ దాతలు, గ్రహీతలను విచారించారు. విచారణ సమయంలో దాతలు పూర్ణిమ అనే మహిళ పేరును ప్రస్తావించారని డీఎంఈ వాణి పేర్కొన్నారు. కుటుంబ ఆర్థిక కారణలతోనే కీడ్నీ మార్పిడికి ఒప్పుకున్నారని, వారు కన్నడ, తమిళం మాట్లాడుతున్నట్లు ఆమె వెల్లడించారు. కానీ అలకనంద ఆసుపత్రికి ఒక ప్లాస్టిక్ సర్జన్ కు మాత్రమే గుర్తింపు ఉందని, ప్లాస్టిక్ సర్జనే ఈ కీడ్నీ శస్త్ర చికిత్సలు చేశారా..? లేదా ఇంకేవరైన చేశారని అనే కోణంలో విచారిస్తున్నామన్నారు.  అనుమతి లేకున్నా శస్త్ర చికిత్స చేసిన వైద్యులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.