calender_icon.png 26 December, 2024 | 6:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మందుబాబులకు వినూత్న శిక్ష

08-11-2024 12:22:00 AM

వారం పాటు పారిశుద్ధ్య పనులు చేయాలని కోర్టు తీర్పు

మంచిర్యాల, నవంబర్ 7 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడిన వారికి మంచిర్యాల కోర్టు వినూత్న శిక్ష విధించింది. వారం రోజుల పాటు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జిల్లా కేంద్రంలోని మాతా శిశు రక్షణ కేంద్రంలో, ఆవరణలో పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని తీర్పునిచ్చింది. మంచిర్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్‌లో 27 మంది పట్టుబడ్డారు. బుధవారం కోర్టులో పోలీసులు హాజరు పరచగా న్యాయాధికారిణి ఉపనిషధ్విని వీరందరికి కమ్యూనిటీ సర్వీస్ శిక్షను విధిస్తూ తీర్పునిచ్చారు.

ఈ శిక్షలో భాగంగా పట్టణంలోని వారం రోజుల పాటు పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని తీర్పునిచ్చారు. మందుబాబులు గురువారం ఉదయం నుంచి ఎంసీహెచ్‌లో పారిశుద్ధ్య పనులు చేయడం ప్రారంభించారు.