calender_icon.png 31 January, 2025 | 5:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరగుండుతో వినూత్న నిరసన

31-01-2025 12:11:17 AM

సూర్యాపేట టౌన్ జనవరి 30: చివ్వెంల మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన విక లాంగురాలు మట్టపల్లి పూలమ్మ భర్త పేరు పైనున్న 7 ఎకరాల 10 గుంటల వ్యవసాయ భూమిని ఆమెకు తెలి యకుండా అక్రమంగా వేరోకరికి రిజిస్ట్రేషన్ చేసిన మోతె తహసీల్దార్ సంఘమిత్రను వెంటనే సస్పెండ్ చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ర్ట అధ్యక్షులు గిద్దె రాజేష్ గురువారం అరగుండుతో జిల్లా కలెక్టరేట్ ఎదుట వినూత్న నిరసనకు దిగారు.

ఈ నెల 27 న సూర్యాపేట ఆర్డీవో సమగ్ర విచారణ చేసి ఎమ్మార్వో ఒరిజినల్ పాస్ పుస్తకాలు లేకుండానే అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిందనే విషయాన్ని గుర్తించినప్పటికీ కలెక్టర్ కు ఎలాంటి నివేదికను పంపలేదని, కలెక్టర్ అక్రమ రిజిస్ట్రేషన్‌పై స్పందించి మోతె ఎమ్మార్వోపై చర్యలు తీసుకోవాలన్నారు.

ఆ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు శేఖర్ రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు షరీఫ్, సభ్యులు బాలకృష్ణ, సైదులు యాదవ్, పేర్ల సోమయ్య యాదవ్, వీరమ్మ జానమ్మ, రాంకుమార్, సంతోష్, నగేష్, హుస్సేన్, పద్మ, వెంకన్న, వెంకన్న  పాల్గొన్నారు.