కుమ్రం భీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న అసంఘటిత కార్మికులు తమకు వేతనాలు విడుదల చేయాలని కండ్లకు గంతలు కట్టుకొని ఆసుపత్రి ఎదుట గురువారం వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్ ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో నిధులు నిర్వహిస్తున్న అసంఘటిత కార్మికుల కు సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ప్రభుత్వం స్పందించి వెంటనే పెండింగ్ వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వర్షాకాల నేపథ్యంలో రోజురోజుకు ఆసుపత్రులలో రోగుల సంఖ్య పెరగడంతో కార్మికులపై పని భారం పెరుగుతుందని అయినప్పటికీ ఎంతో నిబద్దతతో సేవలందిస్తున్న వారి వేతనాలను ప్రతినెల చెల్లించకపోవడం శోచనీయమన్నారు. కార్మికుల వేతనాలు విడుదల చేయకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్మికులు మల్లేష్ ,మురళి ,సత్తార్, మమత తదితరులున్నారు