11-04-2025 12:00:00 AM
పెళ్లి పందిరిలోనే ప్లకార్డులను పట్టుకొన్న నవ దంపతులు
ఇచ్చోడ, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం నవ వధువు కు అందించే తులం బంగారం ఏదంటూ ఏకంగా ఓ పెళ్లి పందిరిలోనే నవ దంపతులు నిరసన వ్యక్తం చేసిన వినూత్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటిల్లో ఒకటైన కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకం కింద లక్ష రూపాయల తోపాటు తులం బంగారం ప్రకటిం చిన సంగతి తెలిసిందే.
ఐతే ఇచ్చోడ మండలంలోని ముఖరా (కే) గ్రామంలో గురు వారం జరిగిన ఓ పెళ్లిలో నవ దంపతులు కాంబ్లె ఆమోల్ - గీతాంజలి రేవంత్ రెడ్డి గారు తులం బంగారం ఎక్కడ అంటూ ప్లకార్డులను పట్టుకుని నిరసన తెలిపడంతో పెళ్లికి వచ్చిన వారు విస్తుపోయారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్ళ్ళున ప్రతి ఆడబిడ్డకు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామ న్నా రు.
కానీ అధికారంలో వచ్చి 15 నెలలు అవుతున్న తులం బంగారం ఇస్తలేరు, తులం బంగారం హామీ బోగస్ అయ్యింది అని, ప్ళ్ళున ఆడపిల్లకు ఇప్పటికైనా తులం బం గారం ఇవ్వాలని నూతన వదువరులు డిమాండ్ చేశారు. తులం బంగారం దేవుడేరుగు ఉన్న కల్యాణ లక్ష్మి ఇస్తలేరని, సీఎం రేవంత్ రెడ్డి ప్ళ్ళున ఆడబిడ్డకు మోసం చేస్తున్నాడని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు బోగస్ అయ్యాయని,
కేసీఆర్ ఆడబిడ్డకు మేనమామ లాగ ఆదుకొని లక్ష రూపాయలు కల్యాణ లక్ష్మి సమయానికి ఇస్తుండే అని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇస్తలేదన్నారు. ఇప్పటికైనా పెండ్లున ప్రతి ఆడబిడ్డకు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్ గ్రామస్తులు పాల్గొన్నారు.