calender_icon.png 26 December, 2024 | 12:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమగ్రశిక్ష ఉద్యోగుల వినూత్న నిరసన

26-12-2024 01:16:23 AM

సిరిసిల్ల, డిసెంబర్ 25 (విజయక్రాంతి) : ప్రభుత్వం వెంటనే స్పందించి సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ బుధవారం ఒంటికాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. వినూత్న నిరసన కార్యక్రమంలో భాగంగా బుధవారం 16 వ రోజు కలెక్టర్ ఆఫీస్ చౌరస్తా వద్ద ఉద్యోగులంతా ఒంటికాలిపై నిలబడి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట నిలబెట్టుకోవాలం టూ నినదించారు. విద్యాశాఖలో కీలకంగా ఉంటూ రెగ్యులర్ ఉద్యోగులకు ఏమాత్రం తీసిపోకుం డా కష్టపడుతున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే వారిని రెగ్యులర్ చేయాలని, అంతవరకు పే స్కేల్ విధానం అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష అన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.