calender_icon.png 10 January, 2025 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమగ్ర ఉద్యోగుల వినూత్న నిరసన

03-01-2025 12:07:38 AM

డిమాండ్లు నెరవేర్చాలని విన్నపం

కామారెడ్డి, నిర్మల్, జనవరి 2 (విజయక్రాంతి): తమ డిమాండ్ల సాధన కోసం ఆం దోళనబాట పట్టిన సమగ్ర సర్వశిక్ష అభియా న్ ఉద్యోగులు వినూత్నంగా నిరసనలు వ్య క్తం చేస్తున్నారు. గురువారం కామారెడ్డి ము న్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టిన ఉద్యోగులు చేతికి సంకేళ్లు వేసుకొని త మ నిరసన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి రే వంత్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. నిర్మల్ ఆర్డీవో ఆఫీస్ వద్ద సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు 24వ రోజు తమ ని రసనను కొనసాగించారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రోబో వేషాధారణలో ఆందోళన చేపట్టారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న స మస్యలపై ప్రశ్నలు రూపొందించి రోబో వే షం వేసిన వ్యక్తితో సమాధానాలు చెప్పించారు.

మహిళా ఉద్యోగికి అస్వస్థత

నిర్మల్‌లో సమ్మెలో పాల్గొన్న మామాడ కేజీబీవీకి చెందిన సీఆర్‌టీ పద్మ తీవ్ర అస్వస్థతతో కుప్పకూలారు. తోటి ఉద్యోగులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.