calender_icon.png 9 January, 2025 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినూత్న ప్రయత్నం.. సక్సెస్ మంత్రం

30-12-2024 03:41:23 AM

ఇండస్ట్రీ అంటేనే ఒక అందమైన ప్రపంచం. ఇక్కడ మంచి ఉంటుంది.. చెడూ ఉం టుంది. ఒక్కదానినే నమ్ముకుని వెళితే సక్సెస్ దొరు కుతుందో లేదో చెప్పలేం. అయితే డిఫరెంట్‌గా ప్రయత్నిస్తే పక్కాగా ఆదరణ లభిస్తుంది. ఈ ఏడాది ఇండస్ట్రీకి మంచి, చెడుల సమ్మిళితంగా సాగిం దని చెప్పాలి.

కొందరు నటీనటులు ఈ ఏడాది కొత్తగా ట్రై చేశారు. సక్సెస్ అయ్యారు కూడా. నటీనటులే కాదు.. కొత్తగా కొరియోగ్రఫీని వీడి డైరెక్టర్ అయిన వారు కూడా ఉన్నారు. సక్సెస్ ఇవాళ కాకుంటే రేపు వస్తుంది. కానీ ఒక ప్రయత్నం మాత్రం మంచే చేస్తుంది. 

అంతరాత్మతో కథ ఆసక్తికరం..

‘క’ చిత్రం విషయానికి వస్తే ఒక వినూత్నమైన కథ. ఇప్పటివరకూ ఎవరూ ఇలాంటి కథతో సినిమా చేయలే దు. ఆత్మలతో సిని మా తీసిన వారున్నారు కానీ అంతరా త్మను కథగా మలిచి సినిమా తీసిన వారు లేరనే చెప్పాలి. సుదీప్, సందీప్ జేఎల్‌కే ఈ క్రెడిట్ దక్కాలి. అసలు అంతరాత్మతో కథ చేయాలనుకోవడమే ఒక ఆసక్తికర అంశం. ఈ ఆలోచనకే మెచ్చుకోవాలి. సినిమాను ఆద్యంతం నడిపించిన తీరు వీరిని విజయ తీరాలకు నడిపించింది. ఒక అద్భుతమైన ప్రయోగానికి ప్రేక్షకులు తమ వంతు సహకారం అందించడంతో బ్లాక్ బస్టర్ హిట్.

‘కిస్సిక్’తో లీల మహత్యం

శ్రీలీల ఈ ఏడాది అమ్మడికి బాగా కలిసొచ్చింది. మంచి స్టార్‌డమ్‌ను అయితే అందుకునే దిశగానే అడుగులు వేసింది. స్టార్ హీరోల సరసన అవకాశాలు కొట్టేసింది. మహేశ్‌బాబు తో ‘గుంటూరు కారం’ సినిమా చేసింది. అయితే ఈ ఏడాది మరో వినూత్న ప్రయత్నం కూడా చేసి సక్సెస్ సాధించింది. ‘పుష్ప2’లో ‘కిస్సిక్’ అనే స్పెషల్ సాంగ్ చేసి.. ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. అమ్మడు స్పెషల్ సాంగ్ చేయడం తొలిసారి. అయినా.. అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. 

కొరియోగ్రఫీ నుంచి డైరెక్షన్ వైపు 

నాగార్జున, ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘నా సామిరం గ’. ఈ ఏడాది సం క్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం. విజయ్ బిన్నీ తొలిసారిగా ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఎన్నో హిట్ చిత్రాలకు కొరియోగ్రఫీ చేసిన విజయ్ బిన్నీ తొలిసారిగా ‘నా సామిరంగ’ చిత్రంతో మెగా ఫోన్ పట్టారు. ఈ సినిమాతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు కొరియో గ్రాఫర్‌గానూ.. దర్శకుడిగానూ రాణిస్తున్నారు.

హీరోగా కమెడియన్..

జబర్దస్త్ షో కమెడియన్‌గా ప్రస్తానాన్ని మొదలు పెట్టిన రాకింగ్ రాకేశ్.. తద్వారా వచ్చిన ఫేమ్‌తో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసేవాడు. ఈ ఏడాది వెండితెరపై ఏకంగా హీరోగా కనిపించాడు. ‘కేశవ చంద్ర రమావత్ అనే చిత్రంతో హీరోగానూ, దర్శకుడిగా నూ, నిర్మాతగానూ మారారు. సినిమా సక్సెస్ రేటును పక్కనబెడితే ఒక మంచి ప్రయత్నం అయి తే చేశాడు. ఇదే ఉత్సాహంతో మరో చిత్రంతో రానున్నట్టు ప్రకటించాడు. 

శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ ఈ ఇద్దరికీ ప్రత్యేకం

ఈ ఏడాది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన చిత్రాల్లో ‘శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్’ ఒకటి. ఈ సినిమాకు రెండు విశేషాలున్నాయి. టైటిల్ క్యాచీగా ఉండటంతో ప్రేక్షకుల్లోకి వెళ్లేందుకు పెద్దగా సమయం పట్టలేదు. రైటన్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రలో నటించాడు.

కామెడీతో కడుపుబ్బా నవ్వించే ఆయన.. ఈ చిత్రంతో హీరోగా మారాడు. కామెడీ హీరో అయినా అదొక అద్భుత ప్రయత్నమే. అలాగే హీరోయిన్‌గా ఉన్న అనన్య నాగళ్ల ఇదే చిత్రంలో నెగెటివ్ రోల్‌లో కనిపించింది. హీరోయిన్‌గా ఎదుగుతున్న క్రమంలో నెగెటివ్ రోల్‌లో నటించాలంటే గట్స్ ఉండాలి.

తర్వాత తిరిగి హీరోయిన్ పాత్రలు వస్తాయో లేదో తెలియదు. ప్రతినాయక పాత్రలో ప్రేక్షకులను ఎంతమేర మెప్పించగలదో తెలియదు. అయినా సరే.. ధైర్యంగా ఒకడుగు వేసి విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది.