ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు
మంచిర్యాల, నవంబర్ 30 (విజయక్రాంతి): సమస్యలకు పరిష్కార మార్గాలే ఆవిష్కరణలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ట్రినిటీ ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిం చిన 2024 జిల్లా స్థాయి బాలవైజ్ఞానిక ప్రదర్శన, 2023 జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ అవార్డుల ప్రదర్శన కార్యక్రమాన్ని కలెక్టర్ కుమార్ దీపక్, డీఈవో యాదయ్యలతో కలిసి ప్రారంభించారు.
ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచి వినూత్న ఆలోచనలతో సమాజ హిత ఆవిష్కరణలు రూపొందుతాయన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి భవిష్యత్తులో ప్రజాప్రయోజనకర అంశాల సాధన దిశగా ప్రోత్సహించేందుకే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. తల్లిదం డ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల ఆలోచనలను ప్రోత్సహించాలని కోరారు. కార్యక్ర మంలో జిల్లా సైన్స్ అధికారి మధుబాబు, ఎంఈవో వీఎస్‌వీ మాళవీదేవి, ట్రినిటీ పాఠశాల కరస్పాండెంట్ జాన్ థామస్, సెక్టోరల్ అధికా రులు శ్రీనివాస్, సత్యనారాయణ మూర్తి, చౌదరి పాల్గొన్నారు.