calender_icon.png 2 February, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తయారీ రంగంలో ఆవిష్కరణలే కీలకం

02-02-2025 01:18:55 AM

ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి 

సంగారెడ్డి, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): తయారీ రంగంలో ఆవిష్కరణలదే కీలకపాత్ర అని, ఇంజినీరింగ్ ఆవిష్కరణలను పెంపొందించేందుకు కృషి చేస్తామని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి పేర్కొన్నారు.

శనివారం కందిలోని ఐఐటీ హైదరాబాద్‌లో ఆత్మనిర్భర్ భారత్‌కు సం బంధించిన న్యూ వెర్షన్లపై సెమినార్ నిర్వహించారు. ఆ సందర్భంగా బీఎస్ మూర్తి మాట్లాడుతూ ప్రధానమంత్రి వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

భారత్ అభివృద్ధి చెందిన దేశంగా త్వరితగతిన అడుగులు వేస్తుందన్నారు. ఐఐటీ హైదరాబాద్‌లో రూపొందించిన పలు సాఫ్ట్‌వేర్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందాయన్నారు. ఐఐటీ హైదరాబాద్ ఇస్రోతో కలిసి పలు ప్రాజెక్టుల్లో భాగస్వామిగా ఉందన్నారు.