నివేద థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన ఫీల్ గుడ్, హోల్సమ్ ఎంటర్టైనర్.‘35-చిన్న కథ కాదు’ సెప్టెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా హార్ట్ టచ్చింగ్ ఎమోషన్స్, హోల్సమ్ ఎంటర్ టైన్‌తో అలరించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ నేపథ్యంలో హీరో విశ్వదేవ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
ప్రిమియర్స్ నుంచి ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది. యునానిమస్‌గా అందరూ సినిమా అద్భుతంగా ఉందని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. విమర్శకులు, ప్రేక్షకుల ముక్త కంఠంతో సినిమాని ప్రశంసిస్తున్నారు. సినిమాకి అందరూ డిస్టింక్షన్ మార్కులు వేశారు. సినిమాలో డైలెక్ట్ ట్రైనింగ్, స్క్రిప్ట్ రీడింగ్ కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాం. క్యారెక్టర్స్ పై ఎక్కువగా చర్చించుకునేవాళ్ళం. క్యారెక్టర్ ఆర్క్‌ని లోతుగా అర్ధం చేసుకోవడానికి ఎక్కువగా డిస్కర్షన్ చేసుకునేవాళ్ళం.
స్టీరియోటైప్ అనేది ప్రతి ఇండస్ట్రీలో వుండే సమస్యే. అయితే దాన్ని చేంజ్ చేయవచ్చని నమ్ముతాను. సినిమా అనేది మ్యాజిక్. రెండుగంటల్లో ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. ఇలాంటి బలమైన మీడియాన్ని కరెక్ట్ గా వాడుకుంటే ఎలా అయిన మలుచుకోవచ్చు. నా నుంచి రాబోయే కొత్త సినిమా క్యారెక్టర్ చూసి కొందరు ’అసలు ప్రసాద్ ఇలా మారిపోయాడేంటీ’ అని షాక్ అవుతున్నారు. ఈ రోజుల్లో ప్రేక్షకులు మరింత అండర్ స్టాండింగ్‌గా ఉన్నారు. కొత్తదనం చూపడం మన చేతుల్లోనే ఉంటుంది.
‘-35-చిన్న కథ కాదు’ లో నా క్యారెక్టర్ కి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా కథ విన్నప్పుడే ప్రసాద్ పాత్ర చేయాలని అనుకున్నాను. ప్రతి యాక్టర్‌కి ఒక బలం ఉంటుంది. ఇంపాక్ట్ ఫుల్ రోల్స్ చేయాలనేది నా ప్రయత్నం. నివేద థామస్ చాలా సపోర్ట్ చేశారు. నేను కొత్త వాడిననే ఫీలింగ్ కలిగించలేదు. ప్రతి ఒక్కరూ సినిమాకి ఏం చేయగలమనే అలోచించారు. నికేత్, వివేక్ సాగర్ ఇలా స్టార్ టెక్నిషియన్స్ అంతా ఒక వేవ్ లెంత్ లో పని చేశారు. అందుకే సినిమా అవుట్ పుట్ ఇంత అద్భుతంగా వచ్చింది.
-మంచి కథలని ఎంచుకోవడంలో రానాగారు ఎక్స్ పర్ట్. మంచి కథలు, కొత్త కథలు చెప్పాలనే తపన ఆయనలో ఉంటుంది. ఆయన చాలా సపోర్ట్ చేస్తారు. అలాగే సృజన్, సిద్ధార్థ్ చాలా పాషన్ వున్న ప్రొడ్యూసర్స్. ఇప్పటివరకూ నేను చేసినవన్నీ బావున్నాయనే జోన్ లోనే చేశాను.