calender_icon.png 22 February, 2025 | 2:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాజాభివృద్ధికి నూతన ఆవిష్కరణలు ముఖ్యం

22-02-2025 12:07:32 AM

జేఎస్‌టీయూహెచ్ హెచ్‌ఓడీ డాక్టర్ వనమాల ఉమారాణి

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): సమాజంలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు ఎదుర్కొనే శక్తి విద్యార్థులకుండాలని, అందుకు తగ్గట్టు ఎల్లప్పుడు నూతన ఆవిష్కరణలు జరగాలని జేఎన్‌టీయూహెచ్ ఐటీ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ వనమాల ఉమారాణి పేర్కొన్నారు.

గుండ్ల పోచంపల్లి పరిధిలోని నర్సింహారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ‘ఇగ్నైట్ 2కె25’ పేరుతో జరిగిన జాతీయస్థాయి ప్రాజెక్ట్ ఎక్స్‌పోలో ముఖ్యఅతిథిగా డాక్టర్ ఉమారాణి, గౌరవ అతిథిగా సీబీఐటీ ప్రిన్సిపాల్ డాక్టర్ సీవీ నర్సింలు, న్యాయనిర్ణేతలుగా జంట్రీల్యాబ్స్ డైరెక్టర్లు పీ నరేంద్రవర్మ, సీబీఐటీ ఏఐ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ మదన్‌మోహన్, ఐఏఆర్‌ఈ ప్రొఫెసర్ డాక్టర్ పీ గోవర్ధన్, హెన్రిచ్ హెచ్‌ఎం సొల్యూషన్ హెచ్‌ఆర్ విభ కల్యాణి, గోకరాజు ఇంజినీరింగ్ కాలేజీ ప్రొఫెసర్ పీ గోపాల్‌కృష్ణ, పేటెంట్ ఐపీఆర్ సొల్యూషన్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం శంకర్‌రావు, ఎంఎల్‌ఆర్‌ఐటీ ప్రొఫెసర్ డాక్టర్ వీ త్రిమూర్తులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ సీవీ నర్సింలు మాట్లాడుతూ నిత్యజీవితంలో వస్తున్న సమస్యలకు అనుగుణంగా సృజనాత్మక పరిష్కారాలు చూపాలన్నారు. కాలేజీ సెక్రటరీ జే త్రిశూల్‌రెడ్డి, డైరెక్టర్ ఏ మోహన్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ లోకనాథం మాట్లాడుతూ ప్రాజెక్ట్ ఎక్స్‌పోల వల్ల విజ్ఞానార్జన జరుగుతుందన్నారు.

అనంతరం ప్రతిభ చూపన శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజీ, నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ, గోకారాజు గంగరాజు ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సమన్వయకర్తలు సీఎస్‌ఈ డీన్ డాక్టర్ డీ మురళి, హెచ్‌ఓడీ డాక్టర్ జీ రాము, ఎఫ్‌ఎంఈ విభాగాధిపతి కిరణ్మయి, డాక్టర్ డీ వెంకట్రావు పాల్గొన్నారు.