calender_icon.png 14 October, 2024 | 5:52 AM

గతిశక్తితో కొత్త ఆవిష్కరణలు

14-10-2024 03:28:00 AM

ప్రధాని మోదీ

ఢిల్లీ, అక్టోబర్ 13: దేశంలో మరిన్ని నూతన ఆవిష్కరణలు రావడానికి గతిశక్తి ప్రాజెక్టు ప్రోత్సహిస్తోందని ప్రధానమంత్రి మోదీ అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన పోస్ట్‌లో మోదీ పేర్కొన్నారు. దేశంలో మౌలిక సదుపాయాలలో మార్పులు తీసుకురావడానికి 2021 అక్టోబర్ 13న ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్(పీఎంజీఎస్ ఎన్‌ఎంపీ)ను అమలులోకి తీసుకువచ్చినట్లు పీఎం తెలిపారు.

దీన్ని ప్రారంభించి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మోదీ మాట్లాడుతూ గతిశక్తి ప్రాజెక్టుల కారణంగా మౌలిక రంగాలు వేగంగా, సమర్థవంతంగా అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు.  దేశంలోని రైల్వేలు, రోడ్లు, పోర్ట్స్, ఎయిర్‌పోర్ట్స్, లాజిస్టిక్  వంటి మౌలిక రంగాల అభివృద్ధిలో గతిశక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని మరింత వేగంగా చేరుకోవడాని గతిశక్తి ప్రాజెక్టు ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.