25-02-2025 02:00:43 AM
తిమ్మాపూర్, ఫిబ్రవరి 24: కరీంనగర్ పట్టణంలోని జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వార్షిక ఇంటర్ కాలేజియేట్ టెక్నికల్ ఈవెంట్స్ ‘ ఇన్నోఫెస్ట్ 2025’ ని, ఎన్‌ఐటి వరంగల్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ బి వి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, విద్యార్థులు సమాజానికి తమవంతుగా ఉపయోగపడేలా, విద్యా విషయాలతో పాటు సమాజం విసురుతున్న సవాళ్లకు తమ మేదస్సుతో ఉపయుక్తమైన ప్రయోగాల ద్వారా లబ్ది చేకూర్చలని, మారుతున్న టెక్నాలజీ కి అనుగుణంగా ఐఓటి, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ వంటి నూతన రంగాల వైపు దృష్టి సారించాలని అన్నారు.
టెక్నికల్ బ్రాంచిల మధ్య సమన్వయం చేసుకుంటూ కొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సోమవారం ప్రాజెక్టు కాంపిటీషన్, పేపర్ ప్రజెంటేషన్, క్రాస్వర్డ్, సర్క్యూట్ డిజైన్, జనరల్ క్విజ్ నిర్వహించారు కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు మాట్లాడుతూ విద్యార్థులలో పోటీతత్వం,సహకారం, క్రమశిక్షణ, సహనం, నాయకత్వ గుణాలు పెంపొందుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ జవ్వాడి సుమిత్ సాయి, ప్రిన్సిపల్ డాక్టర్ టి.అనిల్ కుమార్, ప్రొఫెసర్ ఆర్ బి వి సుబ్రహ్మణ్యం,ప్రిన్సిపాల్ అనిల్ కుమార్,డీన్ (విద్యావేత్త) పీకే. వైశాలి , ఫార్మసి కళాశాల ప్రిన్సిపల్ వి రాజ్ కుమార్ పాల్గొన్నారు.