రోజురోజుకూ సైబర్ క్రైమ్ కేటుగాళ్ళ చేతిలో ఎంతోమంది అమాయకులు మోసపోతున్నారు. సైబర్ క్రైమ్ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. సాంకేతిక పరిజ్ఞానం అరచేతిలో ప్రపంచాన్ని చూసే విధంగా తయారైనప్పుడు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. ‘సైబర్ క్రైమ్’లో నేరగాళ్లు చాలా రకాల టూల్స్ వాడి హ్యాక్ చేస్తుంటారు. ఇదంతా చాలాసార్లు మనకి తెలిసీ, తెలియకుం డానే జరుగుతుంటుంది. సోషల్ మీడియా విపరీతంగా వాడేది మన భారతీయులే. అందులో ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ తదితర సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో బాగా వాడేవారు అనేకమంది ఉన్నారు. వ్యక్తిగత డేటా ఆధారంగా ఇంకొక అకౌంట్ ఓపెన్ చేసి, దగ్గరి ఫ్రెండ్స్‌నుంచి డబ్బులు అడగటం, ఇంకా ఫొటోస్ లాంటివి తీసుకొని అక్రమంగా వాడుకొని లింక్స్ పంపి డబ్బులు అడిగి బెదిరించడం జరుగుతుంది.
ఇటీవల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను టార్గెట్ చేసి వాళ్ళనుండి డబ్బులు అడగటం ఎక్కువవుతున్నది. వాళ్లకు సరిగ్గా సోషల్ మీడియా ఎలా వాడాలో కూడా తెలియదు. జాగ్రత్త పడకపోతే నష్టపోతాం. ప్రతి అకౌంట్‌ను ప్రైవేటు మోడ్‌లో ఉంచాలి. ఫేక్ న్యూస్ కాల్స్ వస్తే వెంటనే సైబర్ క్రైమ్‌కి ఫిర్యాదు చేయాలి. ఈమధ్య కాలంలో బ్యాంకింగ్ రంగంలో డబ్బులు కొట్టేయడం బాగా పెరిగింది. క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌ల ద్వారా డబ్బులు కొట్టేయడంలో సైబర్ నేరగాళ్లు బాగా పండిపోయారు. ఒక కార్డ్ తీసుకున్న తర్వాత వాళ్ళ డేటాను హాక్ చేసి మనకు తెలియకుండానే పెద్ద మొత్తంలో ఒకేసారి డబ్బులు లాగేస్తారు. ఓటీపీల ద్వారా కొన్ని వేల కోట్ల రూపా యలు కొట్టేసిన నేరగాళ్లు ఉన్నారు.
బ్యాంకింగ్ విషయాలలో ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండా లి. అనుమానాస్పద మెసేజ్‌లు, ఓటీపీలు, లింక్స్, ఫొటోస్ లాంటివి వస్తే దానిని ఓపెన్ చేయవద్దు. వెంటనే సైబర్ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళకి కంప్లయింట్ చేయాలి.
బి.కిరణ్ ఫిషర్