యువకవి కుడికాల వంశీధర్ రచించిన ‘లోపలి వాన’ కవితా సంపుటి ఆవిష్కరణ సభ 29న హైదరాబాద్, రవీంద్రభారతిలో జరుగుతుంది. ముఖ్య అతిథి డా॥ ఎన్. గోపి పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. ఆచార్య సూర్యా ధనుంజయ్ అధ్యక్షత వహిస్తారు. డా॥ ఎస్. రఘు విశిష్ట అతిథిగా పాల్గొంటారు. డా॥ గిన్నారపు ఆదినారాయణ గ్రంథ సమాలోచన చేస్తారు. కిన్నెర ఆర్ట్ థియేటర్స్ అధినేత మద్దాళి రఘురాం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే.
మద్దాళి రఘురాం